కరీంనగర్ లో బీజేవైఎం ధర్నా.. పాల్గొన్న రామచందర్ రావు
-పాల్గొన్న బి జె పి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
కరీంనగర్, ఆగస్టు20(విజయక్రాంతి): పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్‌లో భారతీయ జనతా యువ మోర్చా (Bharatiya Janata Yuva Morcha) ఆధ్వర్యంలో "స్టూడెంట్ మార్చ్" పేరిట భారీ నిరసన ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించారు. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని నాయకులు విమర్శించారు.
రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మాట్లాడుతూ.... రాష్ట్రంలో పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్, మెస్ బిల్లులు, స్కాలర్‌షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. "ఫీజుల బకాయి - బిజెపి లడాయి" నినాదంతో కరీంనగర్‌లో ఈ ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే విద్యార్థులను కలుపుకుని ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని బీజేవైఎం హెచ్చరించింది.






