20 August, 2026 | 3:29 PM

భిక్కనూర్ బాలుర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత

20-08-2026 03:00 PM

భిక్కనూర్ బాలుర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత

విద్యార్థుల సంతకాల సేకరణ

​బిక్కనూర్, ఆగస్టు 20: భిక్కనూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ విద్యార్థి పరిషత్ (TGVP) ఆధ్వర్యంలో విద్యార్థుల సంతకాల సేకరణ నిర్వహించారు. పాఠశాలలో రెండేళ్లుగా హిందీ ఉపాధ్యాయుడు లేకపోవడంతో విద్యార్థులు చదువులో వెనుకబడుతున్నారని, జూనియర్ అసిస్టెంట్ కొరతతో స్కాలర్‌షిప్ ఫారమ్‌లు నింపడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీజీవిపి మండల అధ్యక్షులు భరత్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే హిందీ ఉపాధ్యాయుడిని, జూనియర్ అసిస్టెంట్‌ను నియమించాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఈ సంతకాలతో ఎంఈఓ లేదా డీఈఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళా కార్యకర్త శ్రీనిధి, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.