20 August, 2026 | 3:05 PM

తహసీల్దార్ నివాసంపై ఏసీబీ మెరుపు దాడి

20-08-2026 01:21 PM

ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు

​ఇబ్రహీంపట్నం (ఆగస్టు 20): ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో(Ibrahimpatnam RDO Office) తహసీల్దార్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డి నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం ఉదయం ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఆయన ఆదాయానికి మించి అక్రమంగా ఆస్తులు కూడబెట్టారన్న విశ్వసనీయ సమాచారం, ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్యలు చేపట్టారు. ​రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం శ్రీనివాస్ రెడ్డి నివాసంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లు, సంబంధిత కార్యాలయాల్లో ఏకకాలంలో తనిఖీలు ప్రారంభించింది.

​ఏసీబీ అధికారుల సోదాల్లో కీలక 

​రెండు చోట్లా ఏకకాలంలో... శ్రీనివాస్ రెడ్డి గతంలో మహేశ్వరం మండలంలో ఎమ్మార్వోగా పనిచేశారు. ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలో విధులు నిర్వర్తిస్తున్నారు. రెండు ప్రాంతాల్లో ఆయన బాధ్యతల సమయంలో జరిగిన లావాదేవీలపై ప్రధానంగా దృష్టి పెట్టారు. తనిఖీల్లో భాగంగా స్థిరాస్తి పత్రాలు (రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు), బ్యాంకు లావాదేవీల రికార్డులు, లాకర్లు, నగదు మరియు బంగారు ఆభరణాల వివరాలను అధికారులు సూక్ష్మంగా పరిశీలిస్తున్నారు.సోదాల్లో లభించిన కీలక ఆధారాలు, ఆస్తి పత్రాలను అధికారులు నమోదు చేసుకుంటున్నారు. తనిఖీలు పూర్తిగా ముగిసిన అనంతరం స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువను లెక్కించి, తదుపరి చట్టపరమైన చర్యలు (అరెస్టు మరియు కేసు నమోదు) తీసుకుంటామని ఏసీబీ అధికారులు తెలిపారు.