20 August, 2026 | 3:06 PM

మిడ్జిల్‌ లో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

20-08-2026 02:04 PM

మిడ్జిల్(విజయక్రాంతి): మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం.డి. గౌస్ ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశాభివృద్ధి, యువత అభ్యున్నతి, సాంకేతిక రంగంలో రాజీవ్ గాంధీ చేసిన కృషిని స్మరించుకున్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి, మండల నాయకులు, మండల యూత్ అధ్యక్షుడు, గ్రామ సర్పంచులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువ నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.