1 September, 2026 | 1:17 AM

చదువు ఒత్తిడితో టెన్త్ విద్యార్థి మృతి

01-09-2026 12:00 AM

శేరిలింగంపల్లి, ఆగస్టు 31 (విజయక్రాంతి): మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. సుభాష్చంద్రబోస్ నగర్లో నివసిస్తున్న 16 ఏళ్ల పదో తరగతి విద్యార్థి మల్లికార్జున చదువు సరిగా సాగడం లేదనే మనస్తాపంతో ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మల్లికార్జున తన తల్లిదండ్రులతో కలిసి అక్కడే ఉంటున్నాడు.

తండ్రి పెయింటర్గా పనిచేస్తున్నారు. ఇటీవల చదువుపై ఒత్తిడి, పాఠాలు అంతగా అర్థం కాకపోవడంతో విద్యార్థి మానసికంగా కుంగిపోయిన ట్లు కుటుంబం పేర్కొంది. ఇంట్లో ఎవరూ ఊహించని విధంగా ఘటన జరిగింది. సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థి మాన సిక స్థితి, ఇటీవలి పరిణామాలపై పోలీసులు విచారణ చేపట్టారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని మియాపూర్ పోలీసులు తెలిపారు.