1 September, 2026 | 1:26 AM

మల్కాజిగిరి వాసి తమిళనాడులో మృతి

01-09-2026 12:00 AM

సొంత ఖర్చులతో మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన మైనంపల్లి 

మల్కాజిగిరి, ఆగస్టు 31,(విజయక్రాంతి): నేరేడ్ మెట్ కాకతీయనగర్ కు చెందిన ’నెల్సన్ ఫౌల్’ తమిళనాడు వేలన్కాన్ని  చర్చ్ సందర్శనకు వెళ్లగా అక్కడ ఆయనకు దగ్గర గుండెపోటు వచ్చి మరణించారు. బాధిత కుటుంబ సభ్యులు, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వెంటనే స్పందించి, తమిళనాడు గవర్నమెంట్ కలెక్టర్ తో మాట్లాడారు. తన సొంత ఖర్చులతో పార్థివ దేహాన్ని అంబులెన్స్ లో కాకతీయ నగర్ లో మృతుని ఇంటికి చేర్చారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబీకులు హనుమంతరావుకు కృతజ్ఞతలు తెలిపారు