కేంద్రమంత్రి రాజీనామా చేసేంతవరకు పోరాటం ఆగదు
బోథ్, జులై 23 (విజయక్రాంతి): నీట్ పేపర్ లీకేజీ కి బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సత్వరమే రాజీనామా చేయాలని ఆయన రాజీనామా చేసేంతవరకు తమ ఉద్యమం ఆపేది లేదంటూ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు గురువారం మండల కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ సిపిఐ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జంతర్మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులు యువకుల పైన లాఠీ చార్జీ చేయడం ఉద్యమాన్ని నీరు గారు చెప్పే ప్రయత్నం అని వారు పేర్కొన్నారు. శాంతియుతంగా ఉద్యమం చేస్తుంటే బిజెపి నాయకులు చొరబడి హింసను ప్రేరేపించారు అన్నారు.విద్యార్థుల చదువులకు భరోసా ఇవ్వని ప్రభుత్వం గద్దె దిగాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ ప్రవేశపెట్టిన తీర్మానం ప్రకారం ఉభయ సభల్లో చర్చ జరగాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి పశుల చంటి ,కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ మెరుగు భోజన్న, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ ,ఆత్మ చైర్మన్ జి రాజు యాదవ్ ,డిసిసి కార్యదర్శి ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహేందర్ సర్పంచ్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సుద్దల అరుణ్ కుమార్ రెడ్డి ,వ్యవసాయ కమిటీ మాజీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్, సీనియర్ వార్డు సభ్యులు షేక్ సాకిర్, రైతు నాయకులు యల్ల ఇంద్రారెడ్డి షెమిందర్ రెడ్డి, షేక్ అబుద్ తోపాటు, మాజీ ఎంపీటీసీ సట్ల ఉమేష్ ,కోటాకర్ రాజశేఖర్, శంషుద్దీన్ కౌసర్ ,సన్నీ రెడ్డి ,బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు మెరుగు నరసింహ దాస్ సిపిఐ నాయకులు గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు






