23 July, 2026 | 5:15 PM

గురుకుల విద్యార్థుల ప్రాణాలకు రక్షణలేదు

23-07-2026 04:08 PM

బెల్లంపల్లి, (విజయ క్రాంతి): గురుకుల పాఠశాల విద్యార్థులకు ప్రాణాలకు రక్షణలేదనీ టీ ఆర్ ఎస్ వీ జిల్లా అధ్యక్షుడు బడికల శ్రవణ్ అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిలను పరామర్శించారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడారు..బెల్లంపల్లి పట్టణంలోని మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో సుమారు 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురవ్వడం  ఆందోళనకరనన్నారు.

విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన వ్యవస్థ పూర్తిగా విఫలమైందనే దానికి ఇదే నిదర్శనం తెలిపారు..ఈ ఘటనపై వెంటనే ఉన్నతస్థాయి విచారణ జరిపి, నిర్లక్ష్యానికి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలనీ డిమాండ్ చేశారు.. గురుకుల పాఠశాలల్లో అందించే ఆహారం నాణ్యత, పరిశుభ్రత, నిర్వహణపై రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలన్నారు. బాధిత విద్యార్థినులందరికీ మెరుగైన వైద్యం అందించడంతో పాటు ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలనీ కోరారు. ఆయన వెంట  BRSV పట్టణ అధ్యక్షులు ఆడెపు అరుణ్, మాజీ అధ్యక్షులు మురుకురి శ్రావణ్,పట్టణ కార్యదర్శి బుద్ధర్తి సుమంత్, నితీష్,రాజు ఉన్నారు.