అసెంబ్లీలో మరమ్మతు పనులను పరిశీలించిన సీఎం
23-07-2026 04:15 PM
హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో(Assembly Renovation Works) జరుగుతున్న మరమ్మతు పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy ) గురువారం పరిశీలించారు. ప్రజాస్వామ్యానికి ప్రతీక అయిన ఈ ప్రాంగణాన్ని మరింత మెరుగైన మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్దేందుకు చేపట్టిన పనులు వేగంగా, నాణ్యతతో పూర్తయ్యేలా అధికారులను సీఎం ఆదేశించాను. సీఎం వెంట శాసన స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, జైవీర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు ఉన్నారు.






