23 July, 2026 | 5:15 PM

నారుతో కేటీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు

23-07-2026 04:21 PM

పొలంలో రాజమల్లు దంపతులు 

ముస్తాబాద్,జూలై 23( విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ బిఆర్ఎస్ పార్టీ నాయకుడు కొమ్మటి అంజలి రాజమల్లు తన వ్యవసాయ పొలంలో తన అభిమాన నాయకుడు తెలంగాణ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ జన్మదినం  సందర్భంగా తన వ్యవసాయ పొలంలో "హ్యాపీ బర్త్ డే కేటీఆర్ సర్" అని ఆంగ్లంలో రాసి తన అభిమానాన్ని చాటుకున్నాడు.

ఈ సందర్బంగా రాజమల్లు మాట్లాడుతూ కల్వకుంట్ల తారక రామారావు  నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో కలకాలం చల్లగా ఉండాలని ఆ భగవంతున్ని మనస్ఫూర్తిగా కోరారు.ప్రతి సంవత్సరం కేటీఆర్ జన్మదిన వేడుకలు వరి నాట్ల సమయంలో రావడం నారు తోనే వారి పేరు రాసి ఈ విదంగా శుభాకాంక్షలు  తెలియజేయడం ఆనందంగా ఉందన్నారు.వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆశీర్వదించి ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వరి నాట్ల పనులు మొదలుపెట్టి కెసిఆర్, కేటీఆర్ పేర్లు రాసి నాట్లు పంటలు పండించడం వారి పట్ల నాకున్న అభిమానమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తన సతీమణి రాజమల్లు ఉన్నారు.