గణపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ధర్నా
23-07-2026 04:18 PM
గణపురం, జూలై 23 (విజయంక్రాంతి): రాజధాని ఢిల్లీలో జరిగిన ఘటనల నేపథ్యంలో రాహుల్ గాంధీ అరెస్టు, విద్యార్థులపై జరిగిన దాడికి నిరసనగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బట్టు కర్ణాకర్ ల ఆదేశాలతో గణపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు రేపాక రాజేందర్ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ప్రజల హక్కులను అణగదొక్కే చర్యలను ఖండిస్తున్నామని తెలిపారు. విద్యార్థులపై దాడులు జరగడం దురదృష్టకరమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.






