23 July, 2026 | 5:15 PM

పంట సాగుపై ప్రత్యేక దృష్టి సారించండి

23-07-2026 04:05 PM

బోథ్, జులై 23 (విజయక్రాంతి): పంటలకు అనుకూలంగా వర్షాలు కురవడంతో ఆశించిన స్థాయిలో పంటలు మొలకెత్తాయని అయితే భవిష్యత్తులో వర్షా పరిస్థితిలో ఎదురయ్యే ఆస్కారం ఉన్నందున రైతులు పంటలను కాపాడుకునేందుకు తగు చర్యలు తీసుకోవాలని సోనాల మండల వ్యవసాయ అధికారి దేవా నాయక్ కోరారు. గురువారం మండల కేంద్రంలోని రైతు వేదికలో పలు గ్రామాల రైతులతో ఎల్ నీ నో ప్రభావంపై రైతులకు సూచనలు ఇచ్చారు.

భవిష్యత్తులో వర్షా బావ పరిస్థితి ఎదురైతే పంటలను ఏ విధంగా కాపాడుకోవచ్చు అనే అంశంపై రైతులకు సూచనలు ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా వర్షాలు కురుస్తున్నాయని తెలంగాణ రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం వల్ల పంటలను కాపాడుకోవడం రైతులకు సవాల్ గా మారిందన్నారు. రైతులు అధిక రసాయన ఎరువులు వాడ వద్దన్నారు. పంటలు ఎండిపోకుండా పై మందు స్పేలు చేయాలని సూచించారు. అధిక ఎరువులు వినియోగిస్తే పంట నష్టం కలిగే ఆస్కారం ఉందన్నారు. సమావేశంలో గ్రామ సర్పంచ్ బిందుజ తాసిల్దార్ మల్లేష్ ఎంపీడీవో రత్నాకర్ రావు అదుపు ఉమా రైతులు పాల్గొన్నారు.