1 April, 2026 | 2:32 AM

బీసీ ఉద్యోగుల సమస్యలపై పోరాటం

01-04-2026 01:06 AM

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, మార్చి 31 (విజయక్రాంతి): టీజీఎస్‌ఆర్టీసీ బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ (కుషాయిగూడలో) మంగళవారం జరిగిన సమావేశానికి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యకలా పాలు, బిసి ఉద్యోగుల సమస్యలు, సంక్షేమ అంశాలపై విస్తృతంగా చర్చ జరిపారు. కుషాయిగూడ డిపో నూతన కమిటీ పరిచయ కార్యక్రమం జరిగింది. డిపోలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ అధికారులకు వినతిపత్రాన్ని మల్లన్న ఉద్యోగు లతో కలిసి అందజేశారు.

ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ.. బిసి ఉద్యోగులు ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. వారి హక్కుల పరిరక్షణ, ఉద్యో గ భద్రత, పదోన్నతులు, సంక్షేమ పథకాల అమలులో పారద ర్శకత అవసరమని స్ప ష్టం చేశారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే కార్యక్రమంలో పదవి విరమణ పొం దిన ఉద్యోగులను ప్రత్యేకంగా సన్మానించి, వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర నాయకులు, వివిధ జిల్లాల ప్రతినిధులు, ఉద్యోగు లు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.