13-02-2026 12:00:00 AM
పరిశ్రమల్లో తనిఖీకి జాయింట్ ఇన్‌స్పెక్షన్ టీమ్‌లు ఏర్పాటు చేయాలి
సమీక్షా సమావేశంలో సీఎస్ కే రామకృష్ణారావు
హైదరాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి) : భారీ పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాల నివారణకు, కార్మికుల భద్రతకు పటిష్ట చర్య లు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు ఉన్నతాధికారులను ఆదేశించారు. అగ్ని ప్రమాదాల నివా రణకు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు, చర్యలపై స్పష్టమైన ఒక మాన్యువల్‌ను సిద్ధం చేయాలని సూచించారు.
సిగాచి ఇండస్ట్రీస్‌లో జరిగిన దుర్ఘటనపై ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను సంబంధిత అధికారులతో గురువారం సచివాలయంలో సీఎస్ సమీక్షించారు. ఈ ప్రమాదంలో మరణించిన కార్మికుల, బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లింపులు, కోర్టు కేసుల పురోగతిపై సంబంధిత విభాగాల ఉన్నతాధికా రులతో ఆరా తీశారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా భారీ, మధ్య, చిన్నతరహా పరిశ్రమల్లో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలలో వివిధ విభాగాలు సమన్వయంతో తనిఖీలు నిర్వహించుకోవడానికి జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్స్ (ఉమ్మడి తనిఖీ బందాలు) ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా స్థాయిలో రెవె న్యూ, పోలీస్, పరిశ్రమలు, కార్మిక, వైద్య ఆరోగ్య, అగ్నిమాపక, కాలుష్య నియంత్రణ మండలి శాఖల అధికారులతో కూడిన తనిఖీ బృందాలను ఏర్పాటు చేయాలన్నా రు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు, భద్రతా ఆడిట్, అలాగే కార్మికుల భద్రతకు సంబంధించి శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్య లు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అరవింద్ కుమార్, సంజయ్ కుమార్, దాన కిషోర్, ఫైర్ సర్వీస్స్ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్, సంగారెడ్డి కలెక్టర్ ప్రవీణ్య, ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెట్ అథారిటీ కమిషనర్ శశాంక, కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ రవి, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.