calender_icon.png 13 February, 2026 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిగాచీ బాధితులకు భరోసా ఏదీ?

13-02-2026 12:00:00 AM

నెలలు గడిచినా ప్రభుత్వ పట్టింపు కరువు

ఇప్పటికీ బాధిత కుటుంబాలకు పూర్తిస్థాయిలో అందని పరిహారం

ప్రభుత్వ వైఖరిపై అనుమానాలు

హైదరాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): పాశమైలారం పారిశ్రామికవాడలో సిగాచీ కెమికల్స్ ఫ్యాక్టరీలో సంభవించిన ఘోర పేలుడు ఘటన దేశాన్ని కుదిపేసి నెల లు గడిచాయి. 45 మంది కార్మికులు ప్రా ణాలు కోల్పోయారు. కొంత మంది కార్మికులు ఆచూకీ లేకుండా పోయారు. కానీ ఈ ప్రమాదం జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు మాత్రం కమిటీల ప్రకటనలు, కోర్టు వాదనలకే పరిమిత మ య్యాయి.

ప్రమాదానికి కారణమైన కంపెనీ యజమానిని నామమాత్రంగా అరెస్ట్ చేసినప్పటికీ బాధిత కుటుంబాలకు మాత్రం పూర్తి స్థాయిలో పరిహారం అందలేదు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమా? లేక వ్యవస్థాగత లోప మా అనే ప్రశ్నలు రోజురోజుకూ బలపడుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే రాష్ట్ర ప్ర భుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. నిజాలు వెలికితీయాలన్న హామీలు ఇచ్చింది. కానీ ఆ కమిటీ నివేదికకు అనుగుణంగా చర్యలు మాత్రం శూన్యం. ప్రమాదా నికి గల కారణాలు, భద్రతా వైఫల్యాలు, బాధ్యుల వివరాలు--- ఇవేవీ ప్రజల ముందు పెట్టకపోవడం ప్రభుత్వ పారదర్శకత ప్రశ్నార్థకంగా మారింది.

సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రాణాంతక ప్రమాదం యాదచ్ఛికమా? లేక తెలిసీ చూడనట్టు వ్యవహ రించిన ప్రభుత్వ వ్యవస్థ వైఫల్యమా? అనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రమాదానికి ముందు పరిశ్రమ భద్రతపై జరిగిన తనిఖీల్లో తీవ్రమైన లోపాలున్నాయని గుర్తిం చినప్పటికీ చర్యలు శూన్యమేనన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అగ్నిమాపక భద్ర త, ప్రమాదకర రసాయనాల నిల్వ, ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్ అంశాల్లో స్పష్టమైన తప్పి దాలున్నా.. అవన్నీ కేవలం నోటిసులకే పరిమితమయ్యాయన్న విమర్శలు వినిపిస్తున్నా యి. ప్రమాదం జరిగిన రోజున ఫ్యాక్టరీలో మరణించిన వారిలో ఎక్కువ మంది కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేసే వలస కార్మికులే కావడంతో వారిపట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి.

ప్రభుత్వం పరిహారం ప్రకటించినప్పటికీ, అది పూర్తిగా అందలేదని బాధిత కుటుంబాలు వాపోతున్నాయి. వాస్తవానికి సిగాచీ ప్రమాదంలో బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. కోటి పరిహారంగా అందిస్తామని ప్రకటించినప్పటికీ.. అందులో కొంద రికీ రూ.40 లక్షలు, కొందరికి రూ.25 లక్షలు మాత్రమే చెల్లించినట్టు సమాచారం. దీంతో బాధిత కుటుంబాలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నాయి. గాయపడిన కార్మికుల వైద్య ఖర్చులు, పునరావాసం, ఉపాధి భద్రత---ఈ అంశాలన్నీ ప్రభుత్వ ఫైళ్లలోనే పరిమి తమయ్యాయన్న విమర్శలు వస్తున్నాయి.

అనుమతులపై అనుమానాలు 

వాస్తవానికి రాష్ట్రంలో తరచూ పారిశ్రామిక ప్రమాదాలు సంభవిస్తుండటంతో ఆ యా పరిశ్రమలు పొందిన అనుమతులపై అనుమానాలు తలెత్తుతున్నాయి. పరిశ్రమలకు పర్యావరణ అనుమతులు, ఫైర్ సేఫ్టీ క్లియరెన్సులు, కార్మిక భద్రతా సర్టిఫికెట్లు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉన్నా యా? లేక పేపర్లపై మాత్రమే భద్రత ఉం దా? అన్న వాదనలు బలపడుతున్నాయి. ప్రమాదానికి ముందే ఆడిట్లు జరగాల్సి ఉన్నప్పటికీ, అవి వాయిదా పడుతున్నట్టు సమా చారం. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఎక్కడైనా ప్ర మాదం జరిగిన తర్వాతనే ప్రభుత్వ యం త్రాంగంలో కదలిక వస్తుంది.

ప్రమాదం జరిగిన వెంటనే విచారణ కమిటీ, బాధ్యులపై చర్యలు అంటూ ప్రకటనలు చేస్తున్న ప్రభు త్వం ప్రమాదాన్ని నివారించాల్సిన సమయంలో ఎందుకు మౌనం వహిస్తున్నదని ఆరోపణలున్నాయి. వాస్తవానికి సిగాచీ పరిశ్రమలో జరిగిన ఘటన తరహాలో ఎన్నో జరుగుతున్నప్పటికీ ఈ ప్రమాదంలో ఎక్కు వ మంది బాధితులయ్యారు. ఈ ప్రమాదం కేవలం పరిశ్రమ యాజమాన్య వైఫల్యమే అయినప్పటికీ తనిఖీలు చేసిన అధికారులు, నివేదికలను పట్టించుకోని శాఖలు, అనుమతులిచ్చిన పాలనా వ్యవస్థ కూడా ఈ తప్పిదంలో భాగస్వాములేనని అభిప్రాయం వ్యక్తమవుతుంది. 

భద్రతా వైఫల్యాలపై ప్రభుత్వం కినుక 

ఈ పేలుడు యాదృచ్ఛిక ఘటన కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భద్రతా ఆడిట్లు జరగకపోవడం, మండే ధూళి ప్రమాదాలను ముందే గుర్తించడంలో వైఫల్యం, సేఫ్టీ డేటా షీట్లలో లోపాలు, ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్టర్లు, కాలుష్య నియంత్రణ మండలి నిర్లక్ష్యం వంటివి ఈ విపత్తుకు దారి తీశాయని ఆరోపణలు ఉన్నాయి. కానీ ఈ ఆరోపణలపై ప్రభుత్వం సమగ్ర వివరణ ఇవ్వడం లేదు.

ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సవాలు చేస్తూ రిటైర్డ్ శాస్త్రవేత్త కే. బాబురావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన డివిజన్ బెంచ్---ప్రభుత్వాన్ని గట్టి ప్రశ్నలతో నిలదీసింది. ఎఫ్‌ఐఆర్, దర్యాప్తు పురోగతి, అరెస్టులు, పరిహారం అంశాలపై సమగ్ర కౌంటర్ దాఖలు చే యాలని కోర్టు ఆదేశించినప్పటికీ ---ఆ ఆదేశాల అమలు ఎంతవరకు జరిగిందన్నది స్ప ష్టంగా తెలియడం లేదు.

పారిశ్రామిక ప్రమాదాలను నివారించే చర్యలు, ఉల్లంఘిస్తే యాజమాన్యాలపై చర్యలు తీసుకునేందుకు చట్టాలున్నప్పటికీ ఇలాంటి ప్రమాదాలలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవుతుంది. ఆయా పారిశ్రామిక యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడంలో జాప్యం చేయడమో, వెనుకాడడమో జరుగుతుంది. దీంతో కార్మికుల భద్రతను నిర్ధారించే నియంత్రణ వ్యవస్థను ఎందుకు బలోపేతం చేయడం లేదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కార్పొరేట్ ఒత్తిళ్ల ఫలితమా? పరిపాలనా వైఫల్యమా? అనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేకుండా పోయిందనే వాదనలు ఉన్నాయి.