ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయండి
బోథ్ . జూన్ 24 (విజయక్రాంతి) : ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని సోనాల మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గాజుల పోతన్న కోరారు మండల అభివృద్ధి అధికారిగా విధుల్లో విచ్చేసిన రత్నాకర్ ఆర్ ఐ సునీతలను సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న అన్నారు. వాటిని పేద ప్రజలకు చేరేందుకు తమ వంతు సహకారం అందించాలన్నారు. ప్రభుత్వం పథకాలు తీసుకువస్తే అధికారులు ప్రజలకు చేరే విధంగా పనిచేయాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా కార్యక్రమంలో స్థానిక తహసిల్దార్ మల్లేష్ తోపాటు డిసిసి కార్యదర్శి చౌహన్ హరి సింగ్ సర్పంచ్ల సంఘం అధ్యక్షులు చౌహాన్ వినోద్ సింగ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సోమన్న లింగాల భోజన్న మాజీ కోఆప్షన్ సభ్యులు మహమూద్ నాయకులు శ్రీనివాస్ భీమ్రావు పార్టీ శ్రీనివాస్ సంగ్రామ్ ఘన్పూర్ గ్రామానికి చెందిన నాయకులు భీమ్రావు మోరేకర్ దేవరావు పలువురు నాయకులు పాల్గొన్నారు






