10 May, 2026 | 9:06 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

కచ్చితంగా నిబంధనలు పాటించాలి

21-11-2025 12:00 AM

వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు కొనడం, అమ్మడం రెండూ నేరమే. కానీ తెలంగాణలో అన్ని జిల్లాల్లో మెడికల్ షాప్స్ ఈ నిబంధనను యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయి. ధనార్జనే ధ్యేయంగా ప్రజల ఆరోగ్యంతో చెలగాట మాడుతున్నాయి. వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కొక్క మందులషాపులో ఫార్మాసిస్ట్ అందుబాటులో ఉండడం లేదు. అధికారుల నుంచి ఎలాంటి పర్యవేక్షణలు జరగడం లేదు. నిబంధనల ప్రకారం ప్రతి మెడికల్ షాపులో అర్హత పొందిన ఫార్మాసిస్ట్ తప్పనిసరిగా ఉండాలి. యాంటీ బయాటిక్ మందుల అమ్మకాలకు సంబంధించిన హెచ్1 రిజిస్టర్‌ను చాలా దుకాణాలు నిర్వహించడం లేదు.

 జగదీశ్వర్, కరీంనగర్