18 May, 2026 | 3:30 AM

ఆరుబయట మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవు

18-05-2026 02:29 AM

ఎల్లారెడ్డి, 17 (విజయక్రాంతి): ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పంట పొలాల్లో ఆరుబయటం మద్యం, సేవించడం పట్ల ప్రజలకు తీవ్ర అవస్థలు ఎదురవుతున్నాయని పోలీస్ శాఖ పదేపదే చెబుతున్న కొందరు మందుబాబులు వారి మాటను పిడచెవిన పెట్టి పంట పొలాల్లో రోడ్డు పక్కనే ఇష్టాలు సారంగా మద్యం సేవిస్తూ హాయిగా గడుపుతున్నారు.

పంట పొలాల యజమానులు, మందుబాబులకు దయచేసి ఇక్కడి నుండి వెళ్లిపోండి అని చెప్పిన వారికి ఎదురు చూస్తూ మా ఇష్టం మేము తాగుతామని మొండికేస్తూ ఇష్టానుసారంగా సేవిస్తున్నారు. సేవించడమే కాక పంట పొలాల్లో వారు సేవించిన మద్యం సీసాలు పగలగొట్టి, పంట యజమాని కి తీవ్ర అవస్థలు తెస్తున్నారు. పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించి రైతులను కాపాడి పంట పొలాల్లో మద్యం సేవించకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆ రైతు వేడుకుంటున్నారు.