చీపునుంతలలో వీధి దీపాల వెలుగులు
* శాశ్వత లైటింగ్ పనులు ప్రారంభం
తలకొండపల్లి, ఆగస్టు 27(విజయక్రాంతి): గ్రామ అభివృద్ధిలో భాగంగా చీపునుంతల గ్రామ పంచాయతీ పరిధిలో వీధి దీపాల ఏర్పాటు పనులు వేగవంతమయ్యాయి. గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిలోని 'గ్రామ కమాన్' నుండి ఊరి వరకు వరుసగా శాశ్వత (పర్మినెంట్) ఎల్‌ఈడీ లైటింగ్ పనులను సర్పంచ్ గుజ్జుల లక్ష్మమ్మ గురువారం ప్రారంభించారు.రాత్రి సమయాల్లో మెయిన్ రోడ్డు నుండి ఊర్లోకి వెళ్లే దారిలో చీకటి కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించి, గ్రామస్తులు మరియు ప్రయాణికుల భద్రత కోసమే పనులు చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు.
రాత్రి వేళల్లో మహిళలు, వృద్ధులకు రక్షణ కలగడంతో పాటు రహదారి ప్రమాదాలకు అడ్డుకట్ట పడుతుంది. విద్యుత్ ఆదా చేసే నాణ్యమైన ఎల్‌ఈడీ దీపాలను దారి పొడవునా ఏర్పాటు చేస్తున్నారు.సుదీర్ఘకాల సమస్యకు పరిష్కారం చూపుతూ లైటింగ్ పనులు ప్రారంభించడం పట్ల చీపునుంతల గ్రామస్తులు సర్పంచ్ గుజ్జుల లక్ష్మమ్మకు ధన్యవాదాలు తెలిపారు.






