ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే దాకా పోరాటం ఆపేది లేదు
కామారెడ్డి, ఆగస్టు 27 (విజయక్రాంతి): ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే దాకా పోరాటం ఆపేది లేదని టీజీ ఈ జెఎసి రాష్ట్ర బాధ్యులు పులగం దామోదర్ రెడ్డి అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు.ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలైన పిఆర్సి,ఆరు పెండింగ్ డిఏలు,పదివేల కోట్ల బకాయి బిల్లులు అదేవిధంగా సిపిఎస్ రద్దు ఈ నాలుగు అంశాల మీద రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి జిల్లా కేంద్రంలో మహా ధర్నా కామారెడ్డిలో ఘనంగా నిర్వహించినందుకు అభినందించారు.
ఈ సందర్భంగా టీజీ ఈ జెఎసి రాష్ట్ర అడిషనల్ సెక్రెటరీ జనరల్ దామోదర్ రెడ్డి, కో చైర్మన్ సకినాల అనిల్ కుమార్ లు మాట్లాడుతూ.. ఇది ఉద్యోగుల ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలన్నీ మేము పరిష్కరిస్తాం అని ఎన్నికల ముందు హామీలు ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి ఆ మేనిఫెస్టో ని ఇంతవరకు అమలు చేయకపోవడం చాలా శోచనీయమని తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పి ఆర్ సి కి మూడు సంవత్సరాలు పూర్తవుతున్న ఇంతవరకు ప్రకటించకపోవడం దాని అమలు చేయకపోవడం ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరి కనిపిస్తుందని తెలిపారు.
ఈ మహా ధర్నాలో టీజీ ఈ జెఎసి జిల్లా అధ్యక్షులు వెంకటరెడ్డి, సెక్రెటరీ జనరల్ దేవేందర్, అడిషనల్ సెక్రెటరీ జనరల్ కుషాల్ , కో చైర్మన్లు ఆకుల బాబు , పంపరి ప్రవీణ్ కుమార్ ,రాజు, లింగం,బషీర్, డిప్యూటీ సెక్రెటరీ జనరల్ ఎల్లారెడ్డి, ప్రేమ్ కుమార్,చక్రధర్, కో చైర్మన్లు నాగరాజు, సాయిరెడ్డి, చక్రధర్, దేవుల, ముజుబొద్దీన్ , విఠల్ రావు,హనుమంత్ రెడ్డి, వైస్ చైర్మన్లు పర్వతయ్య,నీలం లింగం,మనోహర్, రాజకుమార్ , రాజేష్ తదితరులు పాల్గొన్నారు.






