27 August, 2026 | 7:32 PM

పేదలకు బాసట.. కంటి శస్త్ర చికిత్సలకు ఆసరా

27-08-2026 06:02 PM

డాక్టర్ దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు

మానకొండూరు,(విజయక్రాంతి): పేదలకు బాసటగా నిలిచి, కంటి శస్త్ర చికిత్సలకు ఆసరై, నయా పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ స్థాయి హంగులతో, పూర్తిగా ఉచితంగా 29 మందికి కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించి, వారి చూపుకు దిక్సూచిగా నిలిచిన డాక్టర్ కవ్వంపల్లి అనురాధ, కవ్వంపల్లి సత్యనారాయణ, డాక్టర్ దంపతులకు కంటి శస్త్ర చికిత్సలు విజయవంతంగా పూర్తయిన 29 మంది తమ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

రెండవ విడతగా 30 ఆగస్టున మరి కొంత మందికి కంటి శస్త్ర చికిత్సలు నిర్వహిస్తామని మానకొండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ద్యావ శ్రీనివాసరెడ్డి తెలిపారు. అంకిత్ హాస్పిటల్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో, లయన్స్ వారి సహకారంతో, మండల కేంద్రమైన మానకొండూరులో ఆదివారం జరిగిన ఉచిత వైద్య శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించగా, మానకొండూరు మండలానికి చెందిన 70 మందికి కంటి శస్త్ర చికిత్సలు అవసరమని వైద్య బృందం సిఫారసు చేశారు.

మొదటి విడతగా అందులో ఎంపికైన వారు 29 మందికి పూర్తిగా ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు విజయవంతంగా  పూర్తయ్యాయి. రెండో విడతగా ఆగస్టు 30న మరి కొంతమందికి ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు నిర్వహిస్తారని శ్రీనివాసరెడ్డి తెలిపారు. శస్త్ర చికిత్సలు అవసరమని డాక్టర్లు సిఫారసు చేసిన వారు రెండవ విడతలో సకాలంలో హాజరై సహకరించాలని ఆయన కోరారు.