8 August, 2026 | 10:20 PM

గ్రామంలో ప్రమాదకరంగా మారిన స్ట్రీట్ లైట్ మీటర్

08-08-2026 08:58 PM

బేల,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా బేల మండలం జునోనీ గ్రామంలోని రహదారి పక్కన ఉన్న విద్యుత్ స్తంభానికి అమర్చిన స్ట్రీట్ లైట్ మీటర్ బాక్స్ ప్రమాదకరంగా మారింది. మీటర్ బాక్స్ సరిగా అమర్చకపోవడంతో వైర్లు బయటకు కనిపిస్తూ, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు, పాదచారులు నిత్యం రాకపోకలు సాగించే ప్రాంతంలోనే ఈ పరిస్థితి ఉండటంతో విద్యుత్ షాక్ లేదా ప్రమాదం జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మీటర్ బాక్స్‌ను సురక్షితంగా ఏర్పాటు చేయడంతో పాటు, బయటకు కనిపిస్తున్న విద్యుత్ వైర్లను సరిచేయాలని వారు కోరుతున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌లు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని జునోనీ గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.