అష్టలక్ష్మి ఆలయంలో 'ఉద్వాసన' కార్యక్రమం
- పాతపడిన దేవుళ్ల చిత్రపటాలు, విగ్రహాల స్వీకరణ
ఎల్బీనగర్: ఎల్బీనగర్ జోన్ సరూర్ నగర్ సర్కిల్ అష్టలక్ష్మి టెంపుల్ ప్రాంగణంలో శనివారం డిప్యూటీ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఉద్వాసన పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇళ్లు, వ్యాపార స్థలాల్లో పూజ కార్యక్రమాల్లో భాగంగా పాతబడిన దేవతా ఫొటో ఫ్రేములు, విగ్రహాలను ప్రజలు ఎక్కడపడితే అక్కడ ఖాళీ ప్రదేశాల్లో వేయకుండా పవిత్రంగా ఆలయంలో స్వీకరిస్తున్నారు.
మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అన్ని సర్కిళ్లలో ప్రతి శనివారం ఉద్వాసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి శాస్త్రోక్తంగా "ఉద్వాసన పూజా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు. సేకరించిన వస్తువులను ''వేస్ట్ వెంచర్ ఇండియా లిమిటెడ్" ఆర్గనైజేషన్ ప్రతినిధులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చందన, అష్టలక్ష్మి టెంపుల్ చైర్మన్ నారాయణ , ఏఏ స్వామి హర్షిత, శానిటరీ సూపర్ సూపర్ వైజర్ బుచ్చయ్య, ఎస్ఎఫ్ఏలు శ్రీకాంత్, కీర్తన, అశోక్ పాల్గొన్నారు.






