8 August, 2026 | 11:06 PM

సరూర్ నగర్ చెరువులో గుర్రపు డెక్క తొలిగింపు

08-08-2026 10:03 PM

-  దోమల సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు

- పనులను పరిశీలించిన మల్కాజిగిరి 

- మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి 

ఎల్బీనగర్: గడ్డిఅన్నారం, సరూర్ నగర్ డివిజన్లలో నెలకొన్న దోమల నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. సరూర్ నగర్ చెరువులో పెద్దఎత్తున పేరుకుపోయిన గుర్రపు డెక్కతో దోమల బెడద పెరిగి  చెరువు పరిసర ప్రాంతాల్లోని లింగోజిగూడ, సరూర్ నగర్, సైదాబాద్, ఐఎస్ సదన్ డివిజన్ల ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లడంతో,  సంబంధిత అధికారులతో మాట్లాడారు.

ఎంపీ ఆదేశాలతో సూచనల మేరకు శనివారం ఉదయం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్  వినయ్ కృష్ణారెడ్డి,  ఎల్బీనగర్ జోన్ జోనల్ కమిషనర్ వికాస్ మహాతో, మాజీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి తదితరులు కలిసి సరూర్ నగర్ చెరువును పరిశీలించారు. చెరువులో పూర్తిగా పేరుకుపోయిన గుర్రపు డెక్కను అదనపు యంత్రాలను వినియోగించి వాటిని పూర్తిస్థాయిలో తొలిగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వెంటనే తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో సరూర్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్, ఎల్బీనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, ఈఈ కార్తీక్, డీఈ విజయ్, శానిటేషన్ సూపర్ వైజర్ బుచ్చయ్య, బీజేపీ నాయకులు చిలకూరి రామ్ రెడ్డి, రత్నం తదితరులు పాల్గొన్నారు.