ఐదు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
కరీంనగర్ క్రైం,(విజయక్రాంతి): కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. శనివారం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో గోపాల్పూర్ గ్రామం, గుంటూరుపల్లి గ్రామం, బైపాస్లోని జియో పెట్రోల్ బంక్ సమీపంలో ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు.
బేథి సునీల్ రెడ్డి, కొత్తూరి కుమార్, కొత్తూరి ఆంజనేయులు, పోస్టు గణేష్, గడిప్ర బాలయ్యలు సుల్తానాబాద్ మండలం గొల్లపల్లి మానేరు వాగు నుండి ఇసుకను అక్రమంగా ట్రాక్టర్లలో నింపుకొని, కరీంనగర్ పట్టణంలో అధిక ధరకు విక్రయించేందుకు తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడించారు. ఈ మేరకు ఐదు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని, ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
అక్రమ ఇసుక రవాణాను ఏమాత్రం ఉపేక్షించేది లేదని, చట్టాన్ని ఉల్లంఘించి ఇసుకను అక్రమంగా తరలించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ ఏ నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. పదేపదే అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతూ పట్టుబడే వారిపై, చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా రౌడీ షీట్, పీడీ యాక్ట్ తదితర కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపుతామని హెచ్చరించారు.






