తల్లిదండ్రుల చెంతకు దివ్యాంగుడు
జవహర్‌నగర్,(విజయక్రాంతి): 15 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన 24 ఏళ్ల దివ్యాంగుడు అఖిల్‌ను జవహర్‌నగర్ పోలీసులు చాకచక్యంగా గాలించి క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. అంబేద్కర్‌నగర్ నుంచి బోయిన్‌పల్లి వరకు 100కు పైగా సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి అఖిల్ ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
శనివారం బాలానగర్‌లో అఖిల్ ఉన్నట్లు మున్సిపల్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని అతడిని సురక్షితంగా పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు.అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. తమ కుమారుడిని క్షేమంగా తిరిగి అప్పగించిన సీఐ సైదులు, పోలీసు సిబ్బందికి, సమాచారం అందించిన మున్సిపల్ సిబ్బందికి, ఘటనను ప్రజల దృష్టికి తీసుకెళ్లిన మీడియా ప్రతినిధులకు అఖిల్ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.






