8 August, 2026 | 11:04 PM

యోగలో మోడల్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ

08-08-2026 10:13 PM

సదాశివనగర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా యోగా భవనంలో ఇండియన్ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఏడవ జిల్లా స్థాయి యోగాసనా పోటీలలో సదాశివనగర్ మోడల్ స్కూల్ విద్యార్థులు పాల్గొని పథకాలు సాధించినట్టు ప్రిన్సిపాల్ రాజిరెడ్డి తెలిపారు. అండర్ 14 బాయ్స్ ఆర్టిస్ట్ పెయిర్ విభాగంలోరెండవ స్థానంలో మనోహర్, సాత్విక్ నిలచి సిల్వర్ మెడల్ సాధించారు. రితమిక్ పెయిర్ విభాగంలో శశాంక్, శ్రీవాత్సవ్ రెండవ స్థానంలో నుంచి సిల్వర్ మెడల్ సాధించారు.

రిథమిక పెయిర్ విభాగంలో భగవంత్ రెడ్డి, శ్రీమాన్ చారి మూడవ స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ సాధించారు.ట్రెడిషనల్ ఈవెంట్ విభాగంలో సాత్విక్ అండర్ 14 గర్ల్స్ విభాగంలో రితమిక్ పెయిర్ విభాగంలో మనుశ్రీ , వర్షిణీ నాలుగో స్థానంలో నిలవడం జరిగిందని, ఈ సందర్బంగా విద్యార్థులను అధ్యాపక బృందం అభినందనలు తెలిపారు.