మహిళా సాధికారతకు ‘స్త్రీ రైడ్’
- రవాణా రంగంలోకి అడుగుపెట్టిన నారీశక్తి
- తొలి దశలో 55 మందికి శిక్షణ
- బైక్ రైడర్లు 50 మంది, నలుగురు ఆటో డ్రైవర్లు, మహిళా క్యాబ్ డ్రైవర్ ఒకరు
- జెండా ఊపి ప్రారంభించిన డీజీపీ సీవీ ఆనంద్
రంగారెడ్డి, జూన్ 6 (విజయక్రాంతి): మహి ళా సాధికారతను ప్రోత్సహిస్తూ, వారికి స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘స్త్రీ రైడ్ ఉమెన్ డ్రైవర్స్ ఇనిషియేటివ్’ పేరుతో చేపట్టిన ఈ ప్రత్యేక ప్రాజెక్టును శనివారం హైదరాబాద్‌లోని డీజీపీ ఆఫీసులో డీజీపీ సీవీ ఆనంద్, వివిధ శాఖల అధికారులు జెం డా ఊపి ప్రారంభించారు.
మహిళల భద్రత, ఆర్థిక స్వాతంత్య్రం పరస్పరం అనుసంధానమైన అంశాలని, రవాణా రంగంలో మహి ళలకు గౌరవప్రదమైన ఉపాధి కల్పించడం ద్వారా సమాజంలో వారి స్థానాన్ని మరింత బలోపేతం చేయవచ్చని వారు ఈ సందర్భం గా పేర్కొన్నారు. తొలి దశలో 55 మందికి శిక్ష ణ ఈ కార్యక్రమం మొదటి దశలో భాగంగా ఎంపిక చేసిన మహిళలకు ప్రత్యేక డ్రైవింగ్, భద్రతా శిక్షణ ఇచ్చారు.
అందులో బైక్ రైడర్లు 50 మంది, ఆటో డ్రైవర్లు నలుగురు, క్యాబ్ డ్రైవర్ ఒకరు ఉన్నారు. శిక్షణను (ఎమ్‌ఏడబ్లు ఓ) సీఈఓ జై భారతి పర్యవేక్షించగా.. మహీం ద్రా ఆటో సంస్థ, జిప్పి సీఈఓ ప్రసన్న నారాయణ వాహనాలను సమకూర్చారు. అనంతర ం బిగ్లీ, జిప్పి, ఎమ్‌ఏడబ్లువో సంస్థలు సం యుక్తంగా వీరికి ఉపాధి అవకాశాలను కల్పించాయి. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, పట్టణ ప్రాంతాల్లో మహిళా డ్రైవర్లు అందుబాటులో ఉండటం వల్ల మహిళా ప్రయాణికుల్లో భద్రతాభావం మరింత పెరుగుతుందని అధికా రులు ఆశాభావం వ్యక్తం చేశారు.
కుటుంబ మద్దతుతోనే మహిళల విజయం: డీజీపీ ఆనంద్
డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి ప్రొఫెషనల్ డ్రైవర్లుగా కెరీర్‌ను ఎంచుకోవడం సంతోషకరమన్నారు. ప్రభుత్వ ప్రజాపాలన, అభివృద్ధి కార్యక్రమాల్లో మహిళా భద్రత, సామర్థ్య పెంపునకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. మహిళల విజయంలో కుటుంబ సభ్యుల పాత్ర అత్యంత కీలకమని చెప్పారు.
రోడ్లపై పనిచేసే సమయంలో ఆకతాయిల వల్ల ఏవైనా సవాళ్లు ఎదురైతే అధైర్యపడవద్దని, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మహిళా డ్రైవర్లకు భరోసా ఇచ్చారు. దేశ రక్షణలో మహిళలు ఇప్పటికే ఫైటర్ పైలట్లుగా సేవలు అందిస్తున్నారని, అదే స్ఫూర్తితో రవాణా, సేవా రంగాల్లోనూ మహిళలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.






