8 May, 2026 | 4:18 AM

జేఈఈ బీఆర్క్ ఫలితాల్లో స్టెమ్‌స్పార్క్ హవా

08-05-2026 01:36 AM

మొదటి బ్యాచ్‌తోనే అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులు

హైదరాబాద్, మే 7(విజయక్రాంతి): స్థాని క శ్రీనగర్ కాలనీలోని స్టెమ్‌స్పార్క్ జూనియర్ కాలేజ్ విద్యార్ధులు గురువారం ప్రకటించిన జేఈఈ బీఆర్క్ 2026 ఫలితాల్లో 468వ ర్యాంక్ సాధించి మొదటి బ్యాచ్‌తోనే సంచలన విజయాలను సాధించి ప్రభంజనం సృష్టించ టం జరిగింది.

జేఈఈ బీఆర్క్ అండ్ బీప్లానింగ్ వంటి జాతీయ స్థాయి ప్రతిష్ఠాత్మక పోటీ పరీక్షల్లో 75 మంది పరిమిత విద్యార్థులతో మొదటి ప్రయత్నంలోనే మొదటి బ్యాచ్‌తో ప్రతిష్ఠాత్మక బార్క్ ఫలితాలలో అఖండ విజయాలను సాధించింది. స్టెమ్‌స్పార్క్ విద్యార్ధు లు జాతీయ స్థాయి వివిధ కేటగిరిల్లో ఎం. అ శ్రితమయి- 468, బీవీ మోహన తారక్ - 884, బీ అవినాష్ - 993, బీ విహారిక - 1910, ఎం. వర్షిత్ - 1966, జే అంజలీ - 1983, సీహెచ్ గాయత్రి - 2178, బీ పవీణ్-2234, పీఎన్ అనీరుద్ వర్మ -3267, కే శ్రీకర్ -3541, యు సత్య తేజస్విని - 4035, ఎం. తరుణ్ సాయి - 4842, వీ జ్ఞానశ్రీ - 5112, జీ హర్ష తేజస్విని - 5749 ర్యాంకులను సాధించి విజయకేతనం ఎగురవేశారు.

ఈ అభినందన కార్యక్రమంలో స్టెమ్ స్పార్క్ డైరెక్టర్ కొండా శ్రీధర్‌రావు మాట్లాడుతూ అతి తక్కువ విద్యార్ధులతో మొదటి బ్యాచ్‌లోనే జేఈఈ మెయిన్‌లో 393వ ర్యాం క్‌తో పాటు జేఈఈ బార్క్, బీప్లానింగ్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో అత్యద్భుత ఫలితాలను సాధించడం జరిగింది. భవిష్యత్తు లో స్టెమ్‌స్పార్క్ విద్యార్ధులకు నీట్,ఐఐటీ సీట్ల సాధనే లక్ష్యంగా క్రమబద్దమైన ప్రణాళికతో బోధన చేస్తామని తెలియజేసి జేఈఈ బార్క్ అండ్ బీప్లానింగ్‌లో ర్యాంక్ సాధించిన విద్యార్ధులకు అభినందనలు తెలియజేశారు.