8 May, 2026 | 3:24 AM

16 నుంచి రాష్ట్రంలో సెంట్రింగ్ పని బంద్

08-05-2026 01:35 AM

ముషీరాబాద్, మే 7 (విజయక్రాంతి): భవన నిర్మాణ సెంట్రింగ్ కాంట్రాక్టర్ల అండ్ కార్మికుల సమస్యల సాధన కొరకు ఈనెల 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సెంట్రింగ్ పని బంద్‘ ను చేపడుతున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సెంట్రల్ కమిటీ చైర్మన్ ఎస్. పరశురామ్ రెడ్డి,  అధ్యక్షుడు పి. కృష్ణ,  ప్రధాన కార్యదర్శి ఎండి. చాంద్ పాషాలు తెలిపారు. ఈ మేరకు గురువారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన అసోసియేషన్ సమావేశంలో బంద్ కు సంబంధించిన వాల్ పోస్టర్‌ను పలువురు నాయకులతో కలిసి వారు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవన నిర్మాణ సెంట్రింగ్ కార్మికులకు కార్మిక శాఖ నుండి శాశ్వత గుర్తింపు కార్డులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంతవరకు సెంట్రింగ్ పని బంద్‌ను ఈనెల 16 నుండి చేపడుతున్నట్లు వారు వెల్లడించారు. సెంట్రింగ్ పని బంద్ కార్యక్రమానికి కార్మికులు సహకరించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కోశాధికారి సి.  విష్ణువర్ధన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు ఎన్. శ్రీనివాస్ రెడ్డి, ఆకుల ప్రవీణ్ తో పాటు వందలాది మంది కార్మికులు పాల్గొన్నారు.