ముగిసిన స్టెమ్ సెల్ సదస్సు
500 మందికి పైగా ఆర్థోపెడిక్ సర్జన్లు, రీజనరేటివ్ మెడిసిన్ నిపుణులు, శాస్త్రవేత్తల హాజరు
హైదరాబాద్, మార్చి 15 (విజయక్రాంతి) : స్టెమ్ సెల్ పరిశోధన, రీజనరేటివ్ మెడిసిన్ రంగాలలో అధునాతన పురోగతులపై చ ర్చించేందుకు నిర్వహించిన ప్రతిష్టాత్మక 8వ అంతర్జాతీయ స్టెమ్ సెల్ కాన్ఫరెన్స్ ఐఎస్‌సీఎస్‌జీసీవోఎన్ 2026 హైదరాబాద్‌లో విజయవంతంగా ముగిసింది. ఇండియన్ స్టెమ్ సెల్ స్టడీ గ్రూప్, యశోద హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు మార్చి 14, 15 తేదీలలో తాజ్ డెక్కన్ హోటల్‌లో నిర్వహించబడింది.
భారతదేశం సహా అమెరికా, ఇండోనేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాల నుండి 500 మందికి పైగా ప్రముఖ శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు, పరిశోధకులు పాల్గొ ని రీజనరేటివ్ మెడిసిన్, స్టెమ్ సెల్ సైన్స్ రంగాలలో జరిగిన అధునాతన పరిశోధనలు మరియు క్లినికల్ వినియోగాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. రెండవ రోజు యశోద హాస్పిటల్స్ డైరెక్టర్, మెడికల్ సర్వీస్, డాక్టర్. ఎ.లింగయ్య ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉ స్మానియా మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్, ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ పీఎల్ శ్రీనివాస్ మా ట్లాడుతూ..
అంతర్జాతీయ స్థాయిలో శాస్త్రవేత్తలు, వైద్యులు, పరిశోధకులు ఒకే వేదికపై కలుసుకుని స్టెమ్‌సెల్ పరిశోధన, రీజనరేటివ్ మెడిసిన్ అభివృద్ధిపై చర్చించేందుకు వేదికగా నిలిచిందన్నారకు. యశో ద హాస్పిటల్స్, మలక్పేట్ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ మరియు ఆర్గనైజింగ్ సెక్రటరీ డా క్టర్ కృష్ణ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ఈ సదస్సులో ఆర్థోపెడిక్స్, ఆప్తాల్మాలజీ, సెల్యులా ర్ థెరప్యూటిక్స్ వంటి విభాగాలలో రీజనరేటివ్ మెడిసిన్ వినియోగం విస్తరిస్తున్న విధానంపై చర్చలు జరిగాయాన్నారు. లైవ్ డెమోన్స్ట్రేషన్స్, ఇంటరాక్టివ్ అకాడమిక్ సెషన్స్ ద్వారా పాల్గొన్న వారికి అత్యాధునిక రీజనరేటివ్ చికిత్సా విధానాలపై ప్రాయోగిక అవగాహన లభించిందని యశోద హాస్పిటల్స్, మలక్పేట్ కో-ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఏఎస్‌పీవీఎస్ సాకేత్ అన్నారు.




