అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
రూ.70లక్షల అభివృద్ధిపనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జీఎంఆర్
గుమ్మడిదల, జూన్ 29 : గుమ్మడిదల మండల పరిధిలోని మంబాపూర్, నల్లవల్లి, కొత్తపల్లి, నాగిరెడ్డి గూడెం, అనంతారం, కానుకుంట గ్రామాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా మంజూరైన 70 లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు సోమవారం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్ళడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.
మౌలిక సదుపాయాలు కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. నిర్దేశించిన గడువులోగా అభివృద్ధి పనులు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, ఎంపీడీవో ఉమాదేవి, బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ భాస్కర్ రెడ్డి, వెంకటేష్, సర్పంచులు శ్రీను, నర్సింగ్ రావు, గోవర్ధన్ రెడ్డి, కౌన్సిలర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.






