30 June, 2026 | 2:19 AM

పురుషోత్తంరెడ్డిని పరామర్శించిన శ్రీనుబాబు

30-06-2026 01:37 AM

ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న పీసీసీ ప్రధాన కార్యదర్శి 

మంథని, జూన్ 29 (విజయక్రాంతి): మంథని పట్టణానికి చెందిన జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మూల సరోజన భర్త, ఉత్తమ రైతు అవార్డు గ్రహీత పురుషోత్తం రెడ్డిని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు సోమవారం రాత్రి పరామర్శించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పురుషోత్తం రెడ్డి ఇంటికి శ్రీనుబాబు వెళ్లి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్, కౌన్సిలర్ వంశీ, పెంటరి రాజు, నాయకులు శశిభూషణ్ కాచే, అజీమ్ ఖాన్ ఆరెళ్లి కిరణ్ పాల్గొన్నారు.