తూప్రాన్ రైతువేదికలో విత్తన మేళా
ముఖ్యఅతిథిగా జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్
తూప్రాన్, జూన్ 29: తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలోని రైతు వేదికలో విత్తనాల మేళ కార్యక్రమాన్ని మండల అగ్రికల్చర్ అధికారి గంగుమల్లు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ విత్తనాల మేల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్టిక్ అగ్రికల్చర్ అధికారి, దేవ్ కుమార్, వ్యవసాయ సంచాలకులు సంధ్యారాణి పాల్గొని వారి అమూల్యమైన సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తూప్రాన్ మండల వ్యాప్తంగా రైతులు పాసుబుక్, ఆధార్ కార్డుతో ఫార్మర్ ఐడిని తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని అన్నారు.
నిజమైన రైతులు ఎవరో గుర్తించడం ఫార్మర్ ఐడి ద్వారా సాధ్యపడుతుందని అన్నారు. ముఖ్యంగా రైతులు ఒక్క వరి పంటకే ప్రాధాన్యత కల్పించకుండా వివిధ రకాల పంటలను పండించుకోవాలన్నారు. ఇందులో ముఖ్యంగా ఆయిల్ ఫామ్ పంటలు, పప్పు దినుసుల పంటలు, కూరగాయ, పండ్ల తోటలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఏక కాలంగా ఒక్క వరి పంట వేయడంతో భూమి నిస్సారమైపోతుందని పంట మార్పిడి ఉంటే భూమిలో సారం చేకూరుతుందని వారు సూచించారు.
ఈ విత్తనాల మేళా కార్యక్రమంలో వివిధ పార్టీలైజర్ డీలర్, క్రిమిసంహారక డీలర్ పాల్గొని విత్తనాలను ప్రదర్శిస్తూ రైతులకు కావాల్సిన నాణ్యమైన విత్తనాలను అందించారు. ఇందులో టెక్నికల్ ఏవో యాదగిరి, నర్సాపూర్ ఏవో దీపిక, హరి ప్రసాద్, మనోహరాబాద్ ఏంఏవో స్రవంతి, ఏఈఓ లు భువనేశ్వరి, అభిలాష్, గ్రామాల సర్పంచులు, చిన్న, సన్నకారు రైతులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.






