30 June, 2026 | 2:19 AM

దుబ్బాకలో భారీ చోరీ కలకలం

30-06-2026 01:40 AM
  1. కాశీ యాత్రకు వెళ్లిన కుటుంబం ఇంట్లో దోపిడీ
  2. భారీ మొత్తంలో నగదు, ఆభరణాల అపహరణ
  3. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీపీ

సిద్దిపేట క్రైం, జూన్ 29(విజయక్రాంతి) : సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో భారీ చోరీ కలకలం సృష్టించింది. తీర్థయాత్రలకు వెళ్లిన ఓ కుటుంబం ఇంట్లోకి చొరబడిన దొంగలు భారీ మొత్తంలో నగదు, బంగారాన్ని దోచుకెళ్లారు. దుబ్బాక పట్టణంలోని 15వ వార్డుకు చెందిన చింత రాజ్ కుమార్ అనే మెడికల్ ఏజెన్సీ నిర్వాహకుడు కుటుం బ సభ్యులతో కలిసి తొమ్మిది రోజుల క్రితం కాశీ యాత్రకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడం గమనించిన దుండగులు ఆదివా రం అర్ధరాత్రి దొంగతనానికి పాల్పడ్డారు. ఇంటి కిటికీ ఊచలను విరగ్గొట్టి లోనికి ప్రవేశించారు. బెడ్రూంలో ఉన్న లాకర్ ను పగలగొట్టి అందులో దాచిన బంగారు ఆభరణాలు, నగదుఎత్తుకెళ్లారు.

సోమవారం ఉదయం ఇంటి ఆవరణను శుభ్రం చేయడానికి వచ్చిన పనిమనిషి మంజుల ఇంటి తా ళాలు, కిటికీలు ధ్వంసమై ఉండటాన్ని గమనించి యజమానికి ఫోన్ ద్వారా తెలియ జేసింది. బాధితుల సమాచారం మేరకు దు బ్బాక ఎస్‌ఐ కీర్తిరాజు, సిబ్బందితో కలిసి ఘ టనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం, డా గ్ స్క్వాడ్‌ను రప్పించి వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలను సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. యాత్రకు వెళ్లిన కుటుంబం తిరిగి వస్తేనే ఎంత మొత్తంలో నగదు, బంగారం పోయిందనే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. పోలీస్ కమిషనర్ రష్మీ పెరు మాళ్, ఏసీపీ రవీందర్ రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. దొంగలను పట్టుకో వడానికి ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్టు సీపీ తెలిపారు.