24న మంథనిలో అధునాతన సెంట్రలైజ్డ్ కిచెన్
- ప్రారంభించనున్న రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు
- పాల్గొననున్న హెచ్‌కేఎంసీఎఫ్ అధ్యక్షుడు సత్యగౌర చంద్ర దాస స్వామిజీ, మంత్రులు
హైదరాబాద్, ఆగస్టు 22(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా మంథని వ్యవసాయ మార్కె ట్ యార్డులో ప్రభుత్వ పాఠశాలల విద్రాఉ్థల కోసం ఏర్పాటు చేసిన అధునాతన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను ఈ నెల 24న రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రారంభిం చనున్నారు. ఈ కార్యక్రమానికి హెచ్‌కేఎంసీఎఫ్ అధ్యక్షుడు, అక్షయ పాత్ర ఫౌండేషన్ తెలంగాణ రీజినల్ ప్రెసిడెంట్ హిస్ గ్రేస సత్యగౌర చంద్ర దాస స్వామీజీ హాజరు కానున్నారు.
అలాగే మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, రాష్ట్ర ప్రభు త్వ సలహాదారు హర్కార వేణుగోపాల్ రావు, ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణరావు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్సీలు టి.భానుప్రసాద్‌రా వు, ఎల్.రమణ, సి. అంజిరెడ్డి, మల్క కొమురయ్య, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, మంధని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ సయేందర్ రెడ్డి ముస్కుల, మంథని మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, ప్రత్యేక అతిథులు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ యోగి తారాణా,
ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్, పాఠశాల డైరెక్టర్ డాక్టర్. ఈ.నవీన్ నికోలస్, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో పాటు ఎస్‌సీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి, డైరెక్టర్(పీఏఅండ్‌డబ్ల్యూ) గౌతమ్ పొట్రు, హెచ్‌కేఎం ఛారిటబుల్ ఫౌండేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కౌంతేయ దాస స్వామిజీ తదితరులు పాల్గొననున్నారు. కాగా మంథని మార్కెట్ యార్డులో తెలంగాణ ప్ర భుత్వం కేటాయించిన 8వేల చదరపు అడుగుల షెడ్‌లో ఈ కిచెన్‌ను ఏర్పాటు చేశారు.
పెద్దపల్లి జిల్లాలోని 14 మండలాలు, భూపాలపల్లి జిల్లాలోని 5 మండలాల్లో మొత్తం 694 ప్రభుత్వ స్కూళ్లు, 17 జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 40,052 మంది విద్యార్థులకు ఈ కిచెన్ ద్వారా అల్పాహారం అందించనున్నారు. కిచెన్ అధునాత న సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆటోమేటెడ్ వంట యంత్రాలను ఏర్పాటు చేశారు.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సూచన మేరకు విద్యార్థులకు మెనూను రూపొందించారు. సోమవారం ఇడ్లీ మంగళ వారం పూరీ కుర్మా, బుధవారం దోశఱ గురువారం ఉప్మా శుక్రవారం చిరుధాన్యాల ఇడ్లీ శనివారం బోండా అందించనున్నారు. కిచెన్ నిర్మాణానికి సింగరేణి కాలరీస్ కంపనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్‌ఆర్) నిధుల ద్వారా ఆర్థిక సహాయం అందించింది.






