13 March, 2026 | 12:33 PM

సతీష్ కుటుంబాన్ని అండగా ఉంటాను

13-03-2026 11:05 AM

సతీష్ తల్లిని ఓదార్చిన రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు

మంథని,విజయక్రాంతి: మంథని పట్టణంలోని పోచమ్మ వాడకు చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు పెరుగు సతీష్ ఇటీవల ఆత్మహత్య చేసుకొని మరణించగా శుక్రవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల,  శాసనసభ వ్యవహారాల మంత్రి  దుద్దిళ్ల శ్రీధర్ బాబు వారి ఇంటికి వెళ్లి చిత్రపటానికి పూలమాలవేసి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగడ సానుభూతి తెలిపారు. మంత్రి వెంట ఏఎంసీ చైర్మన్ కుడుదుల వెంకన్న,  మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ,ముసుకుల సహేంద రెడ్డి, కౌన్సిలర్ వంశీ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అయిలి ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.