6 April, 2026 | 5:29 AM

స్టార్టప్ స్టేట్ తెలంగాణ

06-04-2026 03:40 AM
  1. తెలంగాణ ప్రస్థానమంటే ఆత్మగౌరవం, ఆకాంక్ష, పురోగతికి నిదర్శనం
  2. గత ప్రభుత్వ నిర్ణయాలతో గ్లోబల్ ఐటీ దిగ్గజాలకు కేరాఫ్ అడ్రస్‌గా హైదరాబాద్
  3. విదేశాల్లో ఉన్న విద్యార్థులు, నిపుణులు భారత అభివృద్ధిలో భాగస్వాములవ్వాలి
  4. కొలంబియా బిజినెస్ స్కూల్ వేదికగా తెలంగాణ ప్రగతిని చాటిచెప్పిన మాజీ మంత్రి కేటీఆర్

హైదరాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి) : స్వతంత్ర భారతదేశంలో అత్యంత అద్భు తం ‘స్టార్టప్ స్టేట్’ తెలంగాణ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో గల ప్రతిష్టాత్మక ‘కొలంబియా బిజినెస్ స్కూల్’ లో జరిగిన 21వ వార్షిక ‘ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్’లో ఆయన ముఖ్య అతిథిగా ప్ర సంగించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ ఇన్వెస్టర్లను ఉద్దేశించి తెలంగాణ సాధించిన అద్భు త ప్రగతిని ఆయన వివరించారు. ‘తెలంగాణ ఏర్పాటు తర్వాత దశాబ్ద కాలం పాటు జరిగిన అభివృద్ధి’ గురించి కేటీఆర్ మాట్లాడు తూ.. సుదీర్ఘ పోరాటం ద్వారా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం తొలి సీఎం కేసీఆర్ నాయకత్వంలో పరిపాలన, ఆవిష్కరణలు, ఆర్థిక వృద్ధిలో దేశానికే దిక్సూచిగా నిలిచిందన్నా రు.

‘తెలంగాణ ప్రస్థానం అంటే ఆత్మగౌరవం, ఆకాంక్ష, పురోగతికి నిదర్శనం. మేము అవకాశాల కోసం ఎదురుచూడలేదు.. వాటి ని అందిపుచ్చుకునేందుకు అద్భుతమైన పా లసీలను తయారు చేశాం, మౌలిక సదుపాయాలను కల్పించాం. తద్వారా పెట్టుబడి దారుల్లో నమ్మకాన్ని కలిగించి వృద్ధిని సాధించాం’ అని పేర్కొన్నారు. 2027లో భారత్ 80వ స్వాతంత్య్ర దినోత్సవానికి సిద్ధమవుతున్న వేళ, కేవలం పదేళ్లలోనే తెలం గాణ సాధించిన ఆర్థిక ప్రగతి గర్వకారణమని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని, దేశాన్ని నడిపే నాయకత్వానికి  స్పష్టత ఉంటే జవాబుదారీతనం పెరుగుతుంది, తద్వారా అభి వృద్ధి వేగవంతమవుతుంది.

భవిష్యత్తు గు రించి కేవలం మాటలు చెప్పడం కంటే, దానిని మనమే సృష్టించడం ఉత్తమమైన మార్గం’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాలే దేశాభివృద్ధికి ఇంజన్లు అన్న ప్రాథమిక విషయాన్ని కేంద్రం గుర్తించాలన్నారు. భారతదేశ సమాఖ్య స్ఫూర్తిని ప్రస్తావిస్తూ.. దేశాభివృద్ధి అనేది కేవలం ఒకే రకమైన విధానాల వల్ల కాకుండా, ప్రతి రాష్ట్రం తనకున్న ప్రత్యేక బలాలను వినియోగించుకోవ డం ద్వారా సాధ్యమవుతుందని కేటీఆర్ స్ప ష్టం చేశారు.

‘భారతదేశం 28 ఇంజన్లు కలిగిన ఒక ‘ఫార్ములా 1’ రేసింగ్ కార్ లాంటిది. ప్రతి రాష్ట్రం తనదైన శైలిలో అభివృద్ధి చెం దుతూ దేశ ప్రగతికి తోడ్పడాలి’ అని ఆయన అన్నారు. అంతర్జాతీయ పెట్టుబడి నిర్ణయాలు చివరికి రాష్ట్రాలు నగరాల స్థాయి లోనే జరుగుతాయని ఆయన గుర్తుచేశారు. 

ఆవిష్కరణల హబ్‌గా తెలంగాణ

ఐటీ, పారిశ్రామిక రంగంలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని తెలిపారు. 2014 నుండి 2023 మధ్య కాలంలో తెలంగాణ సాంకేతిక రంగం సాధించిన గణాంకా లను కేటీఆర్ వివరించారు. ఐటీ ఎగుమతులు రూ. 57,000 కోట్ల నుంచి రూ. 2.72 లక్షల కోట్లకు పెరిగాయని, ఐటీ ఉద్యోగాల సంఖ్య 3.23 లక్షల నుంచి దాదాపు 10 లక్షలకు చేరుకుందని తెలిపారు.

ప్రభుత్వ వేగ వంతమైన నిర్ణయాలు, పటిష్టమైన ఎకో సిస్ట మ్ కారణంగానే హైదరాబాద్ గ్లోబల్ ఐటీ దిగ్గజాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని చెప్పారు. హైదరాబాద్‌లో అమెజాన్ ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్‌ను ఏర్పాటు చేసిందని, గూగుల్, ఆపిల్, మెటా, సేల్స్ ఫోర్స్, ఉబర్, మైక్రాన్ టెక్నాలజీ వంటి సంస్థలు తమ కీలక కార్యకలాపాలను ఇక్కడ నిర్వహిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఆవిష్కరణలకు చిరునామా తెలంగాణ మా రిందన్నారు. టీ- వీ టీ-వర్క్స్, టాస్క్ వంటి సంస్థల ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరణలకు పెద్దపీట వేసిందని కేటీఆర్ తెలిపారు. స్కైరూట్ ఏరోస్పేస్, డార్విన్ బాక్స్, జెనోటి, హైరేడియస్ వంటి యూనికార్న్ సంస్థలు హైదరాబాద్ నుంచి పుట్టుకురావడమే తెలంగాణ సత్తాకు నిదర్శనమన్నారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగం లో ప్రపంచానికే వ్యాక్సిన్ రాజధానిగా ఎదిగిందని, ప్రపంచ వ్యాక్సిన్లలో మూడో వంతు ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయని ఆయన వెల్లడించారు.

ఏటా 10 బిలియన్ డోసుల వ్యాక్సిన్లను తెలంగాణ ఉత్పత్తి చేస్తోందని, దేశీయ బల్క్ డ్రగ్ ఉత్పత్తిలో 40 శాతం వా టా తెలంగాణదేనని చెప్పారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పుల గురించి ప్రస్తావిస్తూ.. ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ పర్పస్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన ‘కాళేశ్వరం’ ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతోందని వివరించారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లైఫ్ సైన్సెస్, ఫిన్టెక్, అగ్రి- టెక్ వంటి రంగాల సమ్మేళనంతోనే తదుపరి వృద్ధి సాధ్యమని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. విదేశాల్లో ఉన్న విద్యార్థులు, నిపుణు లు భారత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ‘కేవలం ఆలోచనల దగ్గర ఆగిపోకుండా వాటిని సాధించేం దుకు నిబద్ధతతో కూడిన ప్రణాళికలను రూ పొందించండి. పెట్టుబడులను ఆకర్షించడమే కాదు.. ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని నిర్మిం చండి అని పిలుపునిచ్చారు.