20 June, 2026 | 8:39 PM

Breaking News

బాధిత కుటుంబాలకు ‘పీఎస్ఆర్’ భరోసా   •   మా అభాగ్యుల వృద్ధాశ్రమాన్ని సందర్శించిన ఎస్పీ   •   సింగరేణి ఏరియాలో అంతర్జాతీయ యోగా దినోత్సవం: జి ఎం షాలెం రాజు..   •   కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల ప్రేమ లేదు   •   మత్తు రహిత పటిష్ట సమాజ నిర్మాణానికి యోగ ఒక్కటే మార్గం   •   గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి సమిష్టి కృషి   •   ఉద్యాన పంటల సాగును 5 లక్షల ఎకరాలకు విస్తరించాలి   •   అధిక సాంద్రత పత్తి సాగులో న్యూమాటిక్ ప్లాంటర్‌తో విత్తనాల విత్తకం ప్రదర్శన   •   డిజిటల్ లిటరసీ, ఏఐ నైపుణ్యంతో ఉజ్వల భవిష్యత్తు   •   రాజీ మార్గమే రాజమార్గం: సీనియర్ సివిల్ జడ్జి కే.సురేష్   •  

ఫెర్టిలైజర్ షాప్ ప్రారంభం, రహదారులకు శంకుస్థాపన

20-06-2026 07:26 PM

చర్లలో ఎమ్మెల్యే విస్తృత పర్యటన

చర్ల,(విజయక్రాంతి): మారుమూల గిరిజన మండలమైన చర్లకు అభివృద్ధి ఫలాలు అందించే దిశగా భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు గ్రామస్తుల కష్టసుఖాలు తెలుసుకున్నారు. పర్యటనలో భాగంగా తొలుత చర్ల మండల కేంద్రంలో కొత్తగా ఏర్పాటైన ఫెర్టిలైజర్ షాప్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు.

రైతులకు సకాలంలో, సరైన ధరకు ఎరువులు అందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అనంతరం లింగాపురం గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కాకర్ల సుందరయ్య దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. మృతుని చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.

వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. దేవరపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మామిడిగూడెం, గోగుబాక, రాళ్లగూడెం గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. గ్రామీణ రహదారుల అభివృద్ధితోనే మారుమూల ప్రాంతాలు ప్రధాన స్రవంతిలోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు.