6 April, 2026 | 5:29 AM

ప్రతి ఇంటిపై బీజేపీ జెండా

06-04-2026 03:35 AM
  1. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
  2. పార్టీ విస్తరణకు అందరూ కృషి చేయాలి
  3. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు 

హైదరాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): బీజేపీ ఆవిర్భావ దినోత్స వంలో భాగంగా సోమవారం ప్రతి జి ల్లాలో, ప్రతి ఇంట్లో, ప్రతి బూత్‌లో ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను ఘనం గా నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు పేర్కొన్నారు. అందరం బీజేపీ జెండాను ఎగు రవేసి, పార్టీ విస్తరణకు, బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో మరింత అంకితభావంతో పని చేసి పార్టీని అధికారం దిశగా తీసుకెళ్లాలని మనం సంకల్పించాలన్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ చురుకుగా పాల్గొనాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.

పార్టీ ఆవిర్భావ దినోత్సవా న్ని పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో పార్టీ జెం డాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు ఘనంగా జరుపుకోనున్నారని, అయితే అధికారిక వేడుకలకు ముందురోజే ప్రతి బూత్, ప్రతి ప్రాంతంలో పా ర్టీ కార్యకర్తలు ఇప్పటికే బీజేపీ జెండాను ఆవిష్కరించడం ప్రారంభించి, పార్టీ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారన్నా రు. కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి, ప్రజలు కూడా తమ ఇళ్లపై బీజేపీ జెండాను ఎగురవేయాలని కోరుతున్నారని తెలిపారు.

దీంతో జాతీయ గౌరవ భావన, ప్రజా భాగస్వామ్యం, పార్టీ పట్ల ప్రజల ఆత్మీయ అనుబంధం మరింత బలపడుతోందని తెలిపారు. బీజేపీ ఒక రాజకీ య పార్టీ మాత్రమే కాదని, జాతీయ సేవ, జాతీయత, క్రమశిక్షణ, ప్రజల పట్ల నిబద్ధత అనే విలువలతో ముందుకు సాగే ఒక మహత్తర జాతీయ ఉద్యమం అన్నారు. 46వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న బీజేపీ, ఈరోజు ప్రపంచం లోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా నిలవడం మనందరికీ గర్వకారణమన్నారు.

ఒకప్పుడు జనసంఘ్‌గా ప్రారంభమైన ఈ ప్రయాణం, అనంతరం 1980లో ముంబైలో అటల్ బిహారీ వాజపేయి అ ధ్యక్షతన బీజేపీగా రూపుదిద్దుకన్నదన్నా రు. నిజానికి, అటల్ బిహారీ వాజపేయి, ప్రధాని మోదీ దేశ ప్రధానమంత్రులైన తర్వాతనే భారత్ నిజమైన ఆర్థిక మార్పును, అభివృద్ధి కొత్త యుగాన్ని చూడడం ప్రారంభించిందని చెప్పారు. మోదీ ప్రభుత్వం ఒక్క అవినీతి మచ్చ కూడా లేకుండా ప్రజలకు అవినీతి రహిత పాలనను అందిస్తోందని తెలిపారు.

ఈ సందర్భంగా పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ సిద్ధాంతాలను, డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ త్యాగాలను, ముఖ్యంగా కశ్మీర్ కోసం ఆయన చేసిన త్యాగాన్ని ప్రతి కార్యకర్త స్మరించుకుని ప్రేరణ పొందాలన్నారు. ఇదిలా ఉంటే ఖానాపూర్ మున్సిపాలిటీ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు హర్షం వ్యక్తం చేశారు.