5 May, 2026 | 7:32 PM

అడవుల సంరక్షణలో సిబ్బంది కార్యోన్ముఖులు కావాలి: డీఎఫ్ఓ బాలమణి

05-05-2026 06:24 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): అడవుల సంరక్షణలో సిబ్బంది చురుకుగా పనిచేయాలని జిల్లా అటవీ శాఖ అధికారి బాలమణి సూచించారు. జూనియర్ ఫారెస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు యోగేష్ కులకర్ణి ఆధ్వర్యంలో సభ్యులు డీఎఫ్ఓను కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా బాలమణి మాట్లాడుతూ, సమస్యలు ఉంటే నేరుగా తెలియజేయాలని, సిబ్బందికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సద్దాం హుస్సేన్, సాయి చరణ్, స్వప్న, అనిల్ పాల్గొన్నారు.