5 May, 2026 | 7:21 PM

Breaking News

చెరువు కట్టకు మరమ్మత్తులు   •   కలెక్టర్‌ను కలిసిన డీఎఫ్ఓ బాలమణి   •   భారతీయ సంస్కృతిని గౌరవించే పౌరులను తయారు చేయడమే బాలమంగళం లక్ష్యం   •   జిల్లా రెడ్ క్రాస్‌ సొసైటీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   సిబ్బంది సమయపాలన పాటించాలి: జిల్లా కలెక్టర్ హరిత   •   ఈఎంఆర్ఎస్ లో 11వ తరగతిలో దరఖాస్తులకు ఆహ్వానం   •   సిరిసిల్ల పిఏసీఎస్ పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   ఎలక్ట్రానిక్ ఓటింగ్ గోదాం వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్ హరిత   •   సహకార సంఘాల పాత పాలకవర్గం సభ్యులు తిరిగి బాధ్యతలు స్వీకరణ   •   ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు సంపూర్ణ మద్దతు   •  

ఆయిల్ ఫాం సాగుకు రైతులు ముందుకు రావాలి: కలెక్టర్ హరిత

05-05-2026 06:22 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలో ఆయిల్ ఫాం సాగుకు అనుకూల పరిస్థితులు ఉన్నందున అర్హులైన రైతులు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ కె. హరిత పిలుపునిచ్చారు. మంగళవారం నిర్వహించిన రైతు వారం సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సాగు నీరు ఉన్న రైతులు ఈ పంటను చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోందని, మొదటి నాలుగేళ్లు అంతర్ పంటలు వేసుకోవచ్చని తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డెవిడ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కాండే అనిల్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లు ఇరుకుల్ల మంగ, కుడ్మేత విశ్వనాథ్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి నదీం, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటి పాల్గొన్నారు. సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ ఫాం, కూరగాయల సాగు ద్వారా అధిక లాభాలు పొందవచ్చని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తున్న రైతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో రైతులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.