18 March, 2026 | 2:49 PM

ఎస్సెస్సీ పరీక్షలకు 100 శాతం హాజరు: ఎంఈఓ రాజగంగారెడ్డి

18-03-2026 12:39 PM

భిక్కనూర్,మర్చి18(విజయ క్రాంతి: కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలంలో నిర్వహించిన ఎస్సెస్సీ పరీక్షలకు(SSC Public Examination) విద్యార్థులు శాతం 100 హాజరయ్యారని ఎంఈఓ రాజగంగారెడ్డి తెలిపారు. జెడ్పీహెచ్‌ఎస్ బాలుర భిక్కనూర్‌లో 177/177, బాలికల భిక్కనూర్‌లో 158/158, జంగంపల్లి పాఠశాలలో 202/202, పెద్దమల్లారెడ్డి పాఠశాలలో 96/96గా పూర్తి హాజరు నమోదైంది. మొత్తం 633 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా కొనసాగుతున్నాయని, విద్యార్థులు క్రమశిక్షణతో పరీక్షలు రాస్తున్నారని ఆయన పేర్కొన్నారు.