సోషల్ మీడియా దుష్ప్రభావాలపై అప్రమత్తంగా ఉండాలి
విద్యార్థులకు షీ టీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆదేశాల మేరకు ఆసిఫాబాద్ షీ టీం ఆధ్వర్యంలో మండలంలోని బాబాపూర్ గ్రామంలో గల మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీం సభ్యులు విద్యార్థులకు భవిష్యత్ లక్ష్యాలు, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసంపై ప్రేరణాత్మక సూచనలు చేశారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ఇతర సోషల్ మీడియా మాధ్యమాల అధిక వినియోగం వల్ల కలిగే మానసిక ఒత్తిడి, చదువుపై పడే ప్రతికూల ప్రభావాలను వివరించి, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.విద్యార్థులు ఏవైనా వేధింపులు, ఇబ్బందులు లేదా అనుమానాస్పద ఘటనలను ఎదుర్కొంటే వెంటనే ఆసిఫాబాద్ షీ టీంను 8712670564 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సుకన్య, షీ టీం సిబ్బంది స్వప్న, రజని తదితరులు పాల్గొన్నారు.






