17 July, 2026 | 9:02 PM

Breaking News

రోగుల సేవలకు మరింత బలం   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ నైపుణ్యాలతో ఉపాధి పెరుగుతుంది   •   సిరిసిల్ల అభివృద్ధికి కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిందేమీ లేదు: సీపీఎం నేత ఎం.డి. అబ్బాస్   •   విద్యార్థినుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   తరగతి గది దాటిన చిన్నారుల బాధ్యత   •   భార్య కాపురానికి రానని నిరాకరించడంతో భర్త బలవన్మరణం   •   మంథనికి ‘న్యాక్’ అంతర్జాతీయ స్కిల్ సెంటర్: మంత్రి శ్రీధర్ బాబు   •   నాళేశ్వర్ గ్రామంలో ఘనంగా మహాలక్ష్మి బోనాల పండుగ   •   పటేల్‌కుంట చెరువుకు సుందరీకరణ పనులు త్వరలో చేపడతాం: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి   •   బీఆర్ఎస్ వి చౌకబారు రాజకీయాలు: యాదగిరి సునీల్ రావు   •  

పుట్టెడు దుఃఖము.. తండ్రి మృతి, కుమారుని పదవ పరీక్ష

18-03-2026 12:41 PM

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): జిల్లాలో ఎల్లారెడ్డిపేట మండల లోని చందుపట్ల రాజిరెడ్డి గుండెపోటుతో అకాల మరణం చెందాడు. తండ్రి అకాల మరణం.. కుమారునికి పదవ తరగతి పరీక్ష ఉండడంతో కంటినిండా దుఃఖంతో పరీక్ష రాయడానికి సెంటర్ కు వెళ్లిన కుమారుడు..బిజెపి నాయకులు చందుపట్ల రాజిరెడ్డి గుండెపోటుకు గురై మృతి చెందగా తన చిన్న కుమారుడు అక్షిత్ రెడ్డి పదో తరగతి చదువుతున్నాడు.

ఇవాళ హిందీ పరీక్ష ఉండడంతో కన్న తండ్రి మృతి మృతిచెందగా ఇంట్లో కుటుంబ సభ్యులు, బంధువులు రోధిస్తుండగా పదో తరగతి పరీక్ష టైం మొదలు కావడంతో  తను చదువుతున్న విద్యా సంస్థ వ్యవస్థాపకులు లతీఫ్ చేరుకొని కుటుంబ సభ్యులను ఓదార్చి పరీక్ష రాపించి తీసుకువస్తామని నచ్చ చెప్పారు.  పరీక్షా కేంద్రానికి ప్యాడ్ తీసుకుని రాయడానికి వెళ్తూ తన సోదరికి చెప్పి తీవ్ర భావోద్వేగంతో కంటతడి పెట్టాడు. అక్కడ ఉన్న కంటనీరు తెప్పించిన హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది.