13 April, 2026 | 10:45 PM

ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి పరీక్షలు

13-04-2026 09:40 PM

ఏన్కూరు,(విజయక్రాంతి): పదో తరగతి పరీక్షలు సోమవారంతో ప్రశాంతంగా ముగిశాయి.మార్చి 14న ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు ఏన్కూర్ మండలంలోని తిమ్మారావుపేట పరీక్ష కేంద్రంలో మూలపోచారం, తిమ్మారావుపేట, బురద రాఘవాపురం, సెంట్ మేరీస్, పాఠశాల నుండి మొత్తం 85 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏన్కూరు పరీక్ష కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జన్నారం,టి జి.ఆర్.ఎస్ ఎన్కూర్, కేజీబీవీ, గుడ్ న్యూస్ హైస్కూల్ నుండి 188 మంది గాను186 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనారు. మండలంలో రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.

సుదీర్ఘ కాలంగా జరిగిన పరీక్షలు రెండు పరీక్ష కేంద్రాలలో 273 మంది విద్యార్థులకు గాను 271 మంది పరీక్షలు రాశారు. బాలికల ఉన్నత పాఠశాల ఏన్కూర్ పాఠశాల నుండి ఒకరు మరియు జన్నారం పాఠశాల నుండి ఒకరు పరీక్షలకు గైర్హాజరైనారు. పరీక్షల నిర్వహణకు పరీక్షల కేంద్రంలో విద్యార్థులకు కావలసిన మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో కల్పించినట్లు ఆయా సెంటర్ల చీఫ్ సూపరింటెండెంట్స్ జి.నాగరాజు, బి.లక్ష్మా తెలిపారు. పరీక్షలు మొదలైనప్పటి నుండి ఎటువంటి సంఘటన చోటు చేసుకోకుండా ముగించడంతో  ఊపిరి పీల్చుకున్నారు. విద్యార్థులు పరీక్షల కేంద్రం నుండి బయటకు వస్తూ ఆనందోత్సవాలతో కేరింతలతో సంతోషాన్ని వెలుబుచ్చినారు.