సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేత
29-06-2026 07:01 PM
కొల్చారం: నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆవుల రాజి రెడ్డి సహకారంతో కొల్చారం మండలం, పైతర గ్రామానికి చెందిన కీర్తిశేషులు పుట్టి అంజమ్మ కుటుంబానికి 60,000 ల సీఎం సహాయనిధి చెక్కును అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు అండగా నిలవాలనే దృడ సంకల్పంతో, సొంత ఖర్చులతో ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చెక్కును మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు.






