14 March, 2026 | 5:20 PM

పది పరీక్షలు ప్రశాంతం..

14-03-2026 03:53 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణ కోసం బెల్లంపల్లి పట్టణంలో ఐదు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1069 మంది విద్యార్థులకు గాను నలుగురు విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారు. 1065 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పట్టణంలోని సెంట్ మేరీస్ హై స్కూల్ పరీక్ష కేంద్రంలో 240 మంది విద్యార్థులకు గాను 240 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.

యువసంఘటన హైస్కూల్ పరీక్షా కేంద్రంలో 217 మందికి 215 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా ఇద్దరు విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లా పరిషత్ బజార్ ఏరియా హైస్కూల్ పరీక్ష కేంద్రంలో 219 మంది విద్యార్థులకు 2 18 మంది విద్యార్థులు హాజరుకాగా ఒకరు గైర్హాజరయ్యారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో 153 మంది విద్యార్థులకు గాను 152 మంది విద్యార్థులు హాజరు కాగా ఒక విద్యార్థి మాత్రమే గైర్హాజరయ్యారు.

పట్టణంలోని సాంఘిక సంక్షేమ సీవోఈ పాటశాల పరీక్ష కంద్రంలో 240 మంది  విద్యార్థులు హాజరయ్యారు. బెల్లంపల్లి పట్టణంలో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బంధవస్తు ను ఏర్పాటు చేశారు. విద్యార్థులు నిర్ణిత కాలంలోనే తొలి రోజు పరీక్ష కేంద్రాలకు 8 గంటలకే చేరుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్ష కేంద్రాల్లో అధికారులు తగిన సదుపాయాలను కలిపించినట్టు అధికారులు తెలిపారు.