11 May, 2026 | 9:53 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

రాష్ట్ర స్థాయి అబాకస్ పరీక్షలో శ్రీవిద్య విద్యార్థుల విజయం

08-02-2026 06:28 PM

జాతీయ స్థాయికి ఎంపికైన హేమన్

పాపన్నపేట: రాష్ట్ర స్థాయి అబాకస్ పరీక్షలో పాపన్నపేట శ్రీ విద్య స్కూల్ విద్యార్థి టి.హేమన్ ద్వితీయ ర్యాంక్ సాధించి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. హైదరాబాద్ లో రాష్ట్ర స్థాయి అబాకస్ పోటీలు ఆదివారం నిర్వహించారు. ఇందులో వివిధ జిల్లాలకు చెందిన 580 పాఠశాల నుండి  806 మంది విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొన్నారు. శ్రీ విద్య పాఠశాల నుండి ఐదు కేటగిరీలలో విద్యార్థులు పాల్గొని పరీక్షలు రాయగా స్టార్ జూనియర్ లెవెల్ వన్ లో హేమన్ ద్వితీయ ర్యాంక్ సాధించి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు.

హార్దిక్ రామ్ 4వ ర్యాంక్  సాధించారు. స్టార్  జూనియర్ లెవల్ త్రీలో రోహిత్ జీనియస్ బహుమతి సాధించారు. జూనియర్  క్యాటగిరి వన్ లో ఆర్ శ్రీజ తృతీయ ర్యాంక్ సాధించిగా.. జూనియర్ కేటగిరి లెవెల్ 2 లో షీజా తనహి తృతీయ ర్యాంక్ సాధించింది. రాష్ట్ర స్థాయిలో జరిగిన పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచి విద్యార్థులకు పాఠశాల ప్రిన్సిపల్ రవీందర్ గుప్తా, కరస్పాండెంట్ నీఠలాక్షప్ప, సుమన్, ఉపాధ్యాయురాలు  దుర్గ, ప్రియాంక, స్రవంతి, పల్లవి తదితరులు అభినందించారు.