20 March, 2026 | 5:44 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

వైభవంగా ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు

20-03-2026 12:00 AM

ఎర్రుపాలెం మార్చి 19 ( విజయ క్రాంతి): కలియుగ ప్రత్యక్ష దైవం జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో శ్రీ వసంత నవరాత్రి బ్రహ్మోత్సవములు వైభవంగా ప్రారంభమైనవి. వేదమంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యములు నడుమ సాయంత్రం 05:00 గంటలకు తీర్థం బిందెను సాంప్రదాయబద్ధంగా తెచ్చుటతో ఉత్సవములకు అంకురార్పణ జరిపారు.

తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తము నందు స్వామివారికి సుప్రభాత సేవ, సర్వాంగ అభిషేకము, నూతన వస్త్ర అలంకరణ మరియు ఉగాది వేప పువ్వు ప్రసాదం నివేదన మరియు నీరాజనం మంత్రపుష్పములు జరిపి భక్తులకు  రజిత కవచ అలంకారము  లో స్వామివారి దర్శన భాగ్యం కల్పించినాము. ఉదయం 9:30 నీ‘ల నుండి శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితములు తెలుపుతూ పంచాంగ శ్రవణము కార్యక్రమమును ఆలయ ప్రధాన అర్చకులు  శ్రీ ఉప్పల శ్రీనివాస శర్మ,  భక్తులకు వివరించినారు.   ఉదయం 10:30 నీ‘ల నుండి భక్త కళ్యాణం నిర్వహించడం జరిగినది.

దేవాలయమునకు విచ్చేసిన  భక్తులందరికీ విశేషముగా అన్నదానము చేశారు. అనంతరం సాయంత్రం 06-00 గంటలకు యాగశాల ప్రవేశం, కలశ స్థాపన, గణపతి పూజ, పుణ్యాహవచనం,  దీక్షాధారణ, రక్షాబంధనం ఉత్సవములు ప్రారంభం అనంతరం యాగశాల యందు  కార్యనిర్వాహణాధికారి  చేతుల మీదగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమము నిర్వహించడం జరిగినది.

కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి కొత్తూరు జగన్ మోహన్ రావు. ఆలయ ఫౌండర్ ట్రస్ట్  ఉప్పల విజయ దేవశర్మ, మాజీ వ్యవస్థాపక ధర్మ కర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి , ఉప్పల జయదేవ శర్మ, జమలాపురం గ్రామ సర్పంచ్ తుళ్లూరి నిర్మలా కుమారి, వకులా మాత స్టేడియం నిర్మాణ దాత తుళ్లూరు కోటేశ్వరరావు , ఖమ్మం జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వేజెడ్ల సాయికుమార్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.